వైరల్: తనని అయ్యగారిగా మార్చిన వీరాభిమానితో అఖిల్.. ఎమోషనల్ చేస్తున్న వీడియో

మన తెలుగు సినిమా హీరోలు చేసుకున్న అత్యంత అదృష్టం ఏదన్నా ఉంది అంటే అది వారికి అత్యంత వీరాభిమానులు దొరకడమే అని చెప్పాలి. తమ హీరోలని అందరికంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. అలా అక్కినేని కుటుంబంలో అఖిల్ అక్కినేనికి కూడా ఓ వీరాభిమాని ఉన్నాడు.

వీరాభిమాని అంటే అలా ఇలా కాదు అతనో రకం.. అఖిల్ కి అయ్యగారు అని నామకరణం చేసి తనకీ ఒక సెపరేట్ మార్క్ ని సెట్ చేసి అయ్యగారి అభిమానిగా తాను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ అందుకున్నాడు.

ఇలా అఖిల్ ని ఎంతగానో ఆరాధించిన ఆ వీరాభిమానిని నిన్న లెనిన్ సక్సెస్ మీట్ లో స్పెషల్ గా తన కార్వాన్ లో అఖిల్ కలిసిన ఎమోషనల్ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఖిల్ పై ఉన్న ప్రేమను తాను కన్నీళ్లతో చూపించడం ఇతర హీరోల అభిమానులకి కూడా ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తుంది. దీనితో ఈ క్లిప్ వైరల్ గా మారింది.

Exit mobile version