ఆ సినిమా సీక్వెల్ కోసం ఆ దర్శకుడు కూడా !

ENE Repeat

విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన “ఈ నగరానికి ఏమైంది” సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే, ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈసారి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఐతే, ‘ఫంకీ’ దర్శకుడు అనుదీప్ కూడా ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. తన ఫంకీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఈ విషయాన్ని తెలిపాడు.

ఇక ఈ చిత్రాన్ని ఎస్ఎస్ ఒరిజినల్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మరియు శ్రీనాథ్ మాగంటి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ‘ఈ నగరానికి ఏమైంది.. రిపీట్’ అనే టైటిల్‌ ను పెడుతున్నట్లు టాక్ నసుస్తోంది.

Exit mobile version