
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. రామ్ నటిస్తున్న ‘శివం’, ‘హరికథ’ సినిమాలు సెట్స్ పై ఉంటే, ‘పండగ చేస్కో’ సినిమాకి షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇటీవలే ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న పండగ చేస్కో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ చివర్లో ఈ సినిమా ఆడియో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
సినిమా ఆడియో రిలీజ్ అయ్యాక అంచనాలను బట్టి లేక సినిమా రిలీజ్ అయ్యాక సినిమా విజయాన్ని బట్టి ఆ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడు పోతాయి. కానీ రామ్ పండగ చేస్కో సినిమా శాటిలైట్ రైట్స్ ఆడియో రిలీజ్ కంటే ముందే బంపర్ ప్రైజ్ కి అమ్ముడుపోయాయి. మాకు అందిన సమాచారం. జీ తెలుగు వారు పండగ చేస్కో శాటిలైట్ రైట్స్ ని సుమారు 6 కోట్లకి సొంతం చేసుకున్నాయి.
ప్రస్తుతం రామ్ హరికథ షూటింగ్ లో భాగంగా పొల్లాచ్చిలో ఉన్నాడు. అక్కడి నుంచి రాగానే పండగ చేస్కోకి డబ్బింగ్ చెబుతాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టింది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియోని ఈ నెలాఖరులోగా రిలీజ్ చేసి మే 14న సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.

