సాహో రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయిగా

Saaho

ప్రభాస్ సాహో రికార్డ్స్ ఎదో విధంగా ఇంకా కొనసాగుతున్నాయి. బాహుబలితో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ సాహో చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఓ మోస్తరుగా ఆదరిస్తే హిందీ జనాలు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. హిందీలో సాహో చిత్రం 150కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ప్రభాస్ స్టామినా ఏమిటో బాలీవుడ్ సాక్షిగా నిరూపించింది. కాగా సాహో చిత్రంలోని ఒక పాట యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కించుకుంటూ రికార్డు వ్యూస్ సాధిస్తుంది.

ప్రభాస్, శ్రద్దా కపూర్ లమధ్య సాగే ఎన్ని సోని హిందీ సాంగ్ యూట్యూబ్ లో 100మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ లో శ్రద్దా గ్లామర్ తో పాటు ప్రభాస్ స్టైలిష్ అవతార్ అలరించింది. ఆస్ట్రియా దేశంలోని ఆల్ప్స్ పర్వతాలలో తెరకెక్కించిన ఈ సాంగ్ కి గురు రాంధవ సంగీతం సమకూర్చడంతో పాటు పాటను పాడటం జరిగింది. ఇక తులసి కుమార్ ఈ పాటలో ఆయనకు జతగా పాడటం పదారు.

Exit mobile version