శైలి మార్చిన ఎమోషనల్ డైరెక్టర్ !

Satish Vegesna

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా బలంగా ముద్ర పడిపోయిన డైరెక్టర్ ‘సతీష్ వేగేశ్న’. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పాత్రల మధ్య రిలేషన్ ను మరియు సగటు జీవితంలోని సాధారణ సంఘటనలకు సంబంధించి అంతర్లీనమై సందేశాలను బాగా ఎలివేట్ చేసే సతీష్ వేగేశ్న.. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో జనవరి 15న రాబోతున్నాడు. అయితే సతీష్ ఈ సినిమాకి తన శైలిని మార్చుకున్నాడు. ఈ సారి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు యాక్షన్ కూడా జోడించాడు. ఈ సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీ ఇవ్వడం కోసం అన్ని వర్గాల ప్రేక్షుకులను టార్గెట్ చేస్తూ.. ‘ఎంత మంచివాడవురా’ను ఆల్ ఎమోషన్స్ తో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తీర్చదిద్దాడట.

కాగా ఈ సినిమాలో మాస్ అప్పీల్‌ ని రివీల్ చేయడానికి.. ఇప్పటికే టీజ‌ర్ లో యాక్ష‌న్ డోస్ చూపించాడు. తాజాగా వదులుతున్న పోస్ట‌ర్స్ లో కూడా మాస్ ను ఆకట్టుకునేవిధంగా హీరోయిజం పోస్టర్స్ ను వ‌దులుతున్నాడు. మొత్తానికి స‌తీష్ ఈ సినిమాతో తన స్టైల్ మార్చాడు. ఎలాగూ క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సతీష్ వేగేశ్న ఈసారి మాస్ ఆడియన్స్ ను కూడా ఆ స్థాయిలోనే ఆకట్టుకుంటాడేమో చూడాలి.

ఇక శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version