యావత్ భారతదేశం బాహుబలికి సలాం కొడుతుంది

BAAHUBALI
దేశవ్యాప్తంగా నిన్న విడుదలైన బాహుబలి ట్రైలర్ సంచలానలకు నాందిగా నిలిచింది. అభిమానులను, సినీ ప్రియులనే కాక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులను సైతం ఈ చిత్ర ట్రైలర్ విస్మయపరిచింది. ఈరోజు ఉదయానికి 8.5 లక్షల వ్యూస్ తో రికార్డ్ లెవల్లో విజయం సాధించింది.

నార్త్, సౌత్ ప్రముఖులు అంతా ఈ చిత్రాన్ని ఒక విధంగా ప్రశంసల జల్లులో ముంచెత్తడం చూస్తుంటే ప్రతీ తెలుగువాడికీ గర్వంగా వుంది. హాలీవుడ్ భారీ సినిమాలలో 1/10th బడ్జెట్ లో తీసిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలోనే మేకింగ్ వుందని వారి అభిప్రాయం. భారతీయ చిత్రానికి అద్దం పట్టే రీతిలో బాహుబలి వుంటుందని అందరూ ఆశ వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version