ఆ మధ్య మన తెలుగు ఓటిటిలో ఆడియెన్స్ కి ఒక మెమొరబుల్ ట్రీట్ అందించిన సిరీస్ లలో 90స్ బయోపిక్ కోసం తెలియని వారు చాలా తక్కువే ఉండొచ్చు. మరి ఈ సిరీస్ ని తెరకెక్కించిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ఆదిత్య హాసన్ దానికి కొనసాగింపుగా చేస్తున్న థియేట్రికల్ సినిమానే ‘ఎపిక్’.
ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్ ని ఆనంద్ కి అందించారు. అదే 90స్ బయోపిక్ ఫీల్ ని కొనసాగిస్తూ అందులో సోల్ ని ఎక్కడా పోకుండా చాలా డీసెంట్ గా ప్లాన్ చేసి అందించడం ఇందులో విశేషం. అంతే కాకుండా ‘అమృతం’ టైటిల్ సాంగ్ ని కూడా ఇందులో రీ క్రియేట్ చేయడంతో 90స్ బయోపిక్ ఫ్యాన్స్ అందరికీ మరింత ఆహ్లాదంగా అనిపించే విధంగా ప్లాన్ చేశారు.
దీనితో చూసిన వీక్షకులు ఆనందం వ్యక్తం చేస్తుండగా విజయ్ దేవరకొండ కూడా ఆనంద్ కి ఈ టీజర్ తో తన సోదరుడికి తన బెస్ట్ విషెస్ చెబుతూ ఈ ఏడాది అంతా తనకి మరింత ఎపిక్ గా ఉండాలి అంటూ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
