టాక్సిక్ : ఆ డేట్‌పై కన్నేసిన యశ్ అండ్ టీమ్..!

Toxic

రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ మరోసారి వాయిదా పడింది. జూన్ 4న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్వయంగా యశ్ ప్రకటించాడు. ఇటీవల సినిమాకాన్ లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్త పంపిణీదారుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో, గ్లోబల్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, హాలీవుడ్ స్థాయి విజువల్స్ మరియు గ్లోబల్ ప్రమోషన్ల కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో బాలీవుడ్‌లో ‘లాహోర్ 1947’, ‘ఆవారాపన్ 2’ వంటి పెద్ద సినిమాలు ఉండటం గమనార్హం.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కియారా అద్వానీ, నయనతార వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ భాషలతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుండి వస్తున్న సినిమా కావడంతో, ఆలస్యమైనా సరే ప్రపంచస్థాయిలో అత్యుత్తమ అనుభూతిని అందించాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ ఉంది. త్వరలోనే అధికారికంగా కొత్త తేదీని ప్రకటించనున్నారు.

Exit mobile version