
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తూ, ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు హీరోగా కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాలో బాలన్స్ ఉన్న ఓ పాటని బ్యాంకాక్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ పాటలో మంచు విష్ణు – కేథరిన్ స్టెప్స్ వేస్తున్నారు. ఆ పాట షూటింగ్ ని రేపటితో ఫినిష్ చేసుకొని రేపు తిరిగి ఇండియాకి రానున్నారు.
మరోవైపు ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాసరి నారాయణరావు ఈ సినిమాని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో దాసరి – మంచు విష్ణు తాత మనవళ్లుగా గా కనిపించనున్నారు. తమిళంలో హిట్ అయిన ‘మంజపై’ అనే సినిమాకి ఇది రీమేక్. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, అలీ, కృష్ణుడు, రఘుబాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి చక్రి సంగీతం అందిస్తున్నాడు.