‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చిన మహేష్ బృందం ఇకపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుసగా అప్డేట్స్ ఇవ్వనున్నారు. అది కూడా వారానికి ఒకటి చొప్పున ప్రతి సోమవారం అప్డేట్ ఉండనుంది. వాటిలో పాటలు, కౌంట్ డౌన్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియోస్ నుండి ట్రైలర్ వరకు అన్నీ ఉంటాయట. ఈ ప్రక్రియకు టీమ్ మాస్ మహేష్ బాబు మండేస్ అనే పేరును పెట్టారు.
సో.. మహేష్ అభిమానులకు ఇకపై ప్రతి సోమవారం పండగే అనాలి. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి విజయశాంతి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. జనవరి 11న చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది.
