నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. అధికారిక ప్రకటనతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. సోషియో-ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. కథలో పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉంటాయని.. అలాగే భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలక అంశాలుగా ఉండొచ్చని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో బాలకృష్ణ సుమారు 40 నిమిషాలు కనిపించనున్నారట. ఐతే, మరోవైపు మోక్షజ్ఞ – వశిష్ఠ కాంబినేషన్‌పై నెగిటివ్ టాక్ ఉంది. వశిష్ఠకు ఇప్పటివరకు ‘బింబిసార’ ఒక్కటే పూర్తిస్థాయి విజయం. అటు ‘విశ్వంభర’పై వచ్చిన చర్చ కూడా ఈ నెగిటివ్ టాక్ కి కారణం. అయితే మోక్షజ్ఞను రొటీన్ మాస్ కథతో కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో లాంచ్ చేయాలనే ఉద్దేశంతోనే వశిష్ఠను ఎంచుకున్నారనే టాక్ ఉంది. అదే నిజమైతే, “వశిష్ఠ కరెక్ట్ ఛాయిస్ అనుకోవాలి.
