ప్రత్యేకం : ‘మేముసైతం’లో బ్రహ్మి సోలో పెర్ఫార్మన్స్

bhramanandam
తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఏకమై హుదూద్ బాదితులను ఆదుకోవడానికి మేమున్నాం అంటూ ముందుకు వచ్చి చేస్తున్న కార్యక్రమం ‘మేము సైతం’. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ పాల్గొనడమే కాకుండా స్టేజ్ పైన పలు ప్రోగ్రామ్స్ కూడా చేయనున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు ఈ మేము సైతం ప్రోగ్రాంలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయనున్నారనేది మీకు తెలియజేశాం.

మాకు అందిన సమాచారం ప్రకారం తెలుగు వారందరినీ నవ్విస్తున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా మేము సైతం స్టేజ్ పై తన పెర్ఫార్మన్స్ తో తెలుగు ప్రేక్షకులను నవ్వించనున్నాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. బ్రహ్మానందం ఒక్కడే సోలోగా ఓ అరగంట ప్రోగ్రాం చేయనున్నాడు. అంత పెద్ద స్టేజ్ పైన ఒక్కడే అంతసేపు ప్రేక్షకులను నవ్వించడం అంటే అంత ఆషామాషీ కాదు.. కానీ బ్రహ్మానందం దాన్ని చాలెంజ్ గా తీసుకొని చేస్తున్నాడు.

మరి బ్రహ్మానందం ఎలాంటి స్క్రిప్ట్ తో అరగంట పాటు మనల్ని నవ్విస్తాడు అనేది తెలియాలంటే నవంబర్ 30 వరకూ ఆగాల్సిందే. నవంబర్ 30వ తేదీన జరిగే మేము సైతం టెలీథాన్ కార్యక్రమాన్ని మీరు జెమిని టీవీలో చూడవచ్చు.

Exit mobile version