డ్రామాకి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి చేసిన ‘జగన్నాటకం’ సినిమా ద్వారా ప్రదీప్ నందన్ తెలుగు చిత్రసీమకి దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవుతున్నాడు. ఆదిసేశ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేము యంగ్ టాలెంట్ ప్రదీప్ నందన్ తో కాసేపు ముచ్చటించి ఈ సినిమా విశేషాలు తెలుసుకున్నాం.. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ముందుగా మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? అసలు ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ సినిమా ఎలా మొదలైంది?
స) నేను స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సినిమాల మీద ఉన్న మక్కువతో ఐటి ఫీల్డ్ ని వదిలి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. మొదటగా చంద్రశేఖర్ యేలేటి దగ్గర ‘ప్రయాణం’ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసాను. ఆ తర్వాత ఎక్కడా ట్రై చెయ్యలేదు. సొంతగా కథ సిద్దం చేసుకున్నాక మా నాన్న, అన్నయ్యనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తా అనడంతో సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాం.
ప్రశ్న) ఈ సినిమాకి డైరెక్టర్ గా చేసారు, అలాగే లీడ్ రోల్ చేసారు.. అసలు ఏమవుదాం అని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు. ఏమయ్యారు?
స) స్వతహాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నటుడు అవ్వాలనుకున్నాను. కానీ ఇక్కడ డైరెక్ట్ గా నటుడు అవ్వాలి అంటే ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి. అది లేకపోవడం వలన ముందు డైరెక్టర్ గా వచ్చి తర్వాత నటుడవ్వాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా నా మొదటి సినిమాతోనే దర్శకుడిగానే కాకుండా నటుడిని కూడా అయిపోయాను.
ప్రశ్న) మొదటి సినిమాకే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – పాటలు – దర్శకత్వం – యాక్టింగ్ లాంటి డిపార్ట్ మెంట్స్ ని మీరే డీల్ చేసారు. మొదటి సినిమాకే ఇన్ని బాధ్యతలు తీసుకోవడం వల్ల అనుకున్న కాన్సెప్ట్ మిస్ ఫైర్ అవుతుందని ఎప్పుడు భయపడలేదా.?
స) ఒక సినిమా వచ్చి మిస్ ఫైర్ అయితే వాడికెందుకు డైరెక్షన్, వాడికెందుకు యాక్టింగ్ అని అంటారు. కానీ అవన్నీ నేను ఆలోచించలేదు. నేను రాసుకున్న దాన్ని తీశాను. పర్ఫెక్ట్ గా రాసుకున్నా కాబట్టి ఎక్కడా భయ పడలేదు. మిస్ ఫైర్ అవ్వుద్దా, హిట్ అవ్వుద్దా అనే కోణంలో నేను అసలు ఆలోచించలేదు. నేను డీల్ చేసిన డిపార్ట్ మెంట్స్ అన్నీ నాకు ఇష్టమైనవే, అందుకే ఎలాంటి ప్రెజర్ లేకుండా చేసాను.
ప్రశ్న) ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. కానీ మీరు స్టొరీ లైన్ మొత్తాన్ని క్లియర్ గా ట్రైలర్ లో చెప్పేశారు. మరి రెండు గంటల పాటు ఆడియన్స్ థియేటర్స్ లో కూర్చో బెట్టగలరా.?
స) అవును. ఇదే విషయాన్ని చాలా మంది అన్నారు. నా పరంగా ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చో బెట్టగలననే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదొక స్క్రీన్ ప్లే బేస్ మూవీ. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చెప్పాలంటే సినిమాలో కూడా ఏం జరిగింది అనేది నేను ఇంటర్వల్ బ్లాక్ లో రివీల్ చేసేస్తా కానీ ఎలా జరిగింది అనే సస్పెన్స్ ని మాత్రం చివరి వరకూ అలానే ఉంచాను. అందుకే నాకు సినిమాపై కాన్ఫిడెంట్ ఉంది.
ప్రశ్న) ఈ సినిమాలో మీతో పాటు పనిచేసిన కో స్టార్స్ మరియు టెక్నికల్ టీం గురించి చెప్పండి.?
స) హీరోయిన్ ఖేనిష చంద్రన్ చాలా కోపరేటివ్ కో స్టార్. ఈ సినిమా ఎక్కువ భాగం నైట్ షూటింగ్ కావడం వలన నా కో స్టార్స్ ని ఇబ్బంది పెట్టాను. కానీ వారు అర్థంచేసుకొని బాగానే కోపరేట్ చేసారు. వాళ్ళకి నా థాంక్స్, ఇక టెక్నికల్ గా అజయ్ పాటల కంటే రీ రికార్డింగ్ హైలైట్ అవుతుంది. సందీప్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది.
ప్రశ్న) మీ పరంగా ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ ఏమవుతాయి.?
స) నాకు తెలిసినంత వరకూ ఈ సినిమాకి స్క్రీన్ ప్లేనే హైలైట్ అవుతుంది. స్క్రీన్ ప్లే ‘ప్రెజెంట్ – పాస్ట్’ అని ముందుకు వెళుతూ ఉంటుంది. ఇది కనెక్ట్ అయ్యింది అంటే సినిమా పెద్ద హిట్ అయినట్టే.. ఇక పోతే చివరి 20 – 30 నిమిషాల ఎమోషనల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అవుతుంది.
ప్రశ్న) మొదటి సినిమాతో డైరెక్టర్, యాకర్ అయ్యారు. ఈ రెండింటిలో ఏది టఫ్ అనిపించింది.?
స) నా వరకూ రెండింటిలో ఏదీ టఫ్ అనిపించలేదు. యాక్టింగ్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఫాషన్ కావడం వలన కష్టం అనిపించదు. ఇక డైరెక్షన్ అనేది నేను బాగా ఎంజాయ్ చేస్తాను. రైటింగ్ అండ్ డైరెక్షన్ అనేది నాకు బాగా కిక్ ఇచ్చే విషయాలు. అన్నీ నాకు ఇష్టమైనవే కాబట్టి ఏదీ టఫ్ అనిపించలేదు.
ప్రశ్న) మీరు నటుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను అన్నారు. మరి ఈ సినిమా తర్వాత దర్శకుడిగా కంటిన్యూ అవుతారా లేక నటుడిగా మారతారా.?
స) ప్రస్తుతానికి నటుడిగా లేదా డైరెక్టర్ గా నెక్స్ట్ సినిమాలు ఏమీ లేవు. ప్రస్తుతం నా దగ్గర ప్రతి ఒక్క హీరోకి సరిపోయే కథలు ఉన్నాయి. అందుకే రెండవ సినిమాని నటుడిగా కాకుండా డైరెక్టర్ గా చెయ్యాలని ఉంది. ప్రస్తుతానికి ఏం ప్లాన్స్ లేవు. జగన్నాటకం రిలీజ్ అయ్యాక ఎవరినైనా కలిసి కథ చెప్పాలి.
ప్రశ్న) రేపు ఈ సినిమా చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు జగన్నాటకం గురించి ఏం చెబుతారు.?
స) ఇదొక ప్యూర్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఇందులో మీరు ఊహించని ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ అయితే రాలేదని మాత్రం చెప్పగలను. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
అంతటితో ఈ న్యూ డైరెక్టర్ ప్రదీప్ నందన్ కి ఆల్ ది బెస్ట్ మా ఇంటర్వ్యూని ముగించాం..
