ప్రత్యేక ఇంటర్వ్యూ : రాజేష్ టచ్ రివర్ – అబ్బాయిల కోసం తీసిన లేడీ ఓరియంటడ్ సినిమా ‘నా బంగారు తల్లి’

Rajesh-Touchriver
మూడు జాతీయ అవార్డులు, అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు సొంతం చేసుకున్న సినిమా ‘నా బంగారు తల్లి’. ఈ రోజు విడుదలవుతున్న ఈ సినిమా డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తో 123తెలుగు.కామ్ జరిపిన ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ మీకోసం…

ప్రశ్న) చివరకు మీ సినిమా విడుదలకానుంది.. మీరూ ఎలా ఫీల్ అవుతున్నారు?

స) ఇటువంటి రియలిస్టిక్ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

ప్రశ్న) ఈ సినిమా విడుదల చేయడానికి ఎంత కష్టపడ్డారు?

స) నాకు బయ్యర్ దొరకడం చాలా కష్టమయ్యింది. పంపిణీదారులు సినిమా చూసి నచ్చింది అన్నారు తప్ప కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ కు వెళ్ళాం.

ప్రశ్న) ఇది ఎవరి ఆలోచన?

స) క్రౌడ్ ఫండింగ్ కు వెళ్ళమని అక్కినేని అమల గారు సలహాఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత అమల గారు, సినిమా విడుదల చేయడానికి పలు సలహాలు ఇచ్చారు

ప్రశ్న) పబ్లిక్ నుండి ఎటువంటి ఫండ్స్ ని స్వీకరించారు?

స) సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వారి తాహతకు తగ్గట్టు ధన సహాయం అందజేశారు. ఆ నోటా ఈ నోటా ఈ మాట రిలయన్స్ దగ్గరకు వెళ్ళింది. వారు పెద్ద మొత్తంలో ధన సహాయం అందించారు.

ప్రశ్న) ఈ సినిమా ప్రచారానికి చిరంజీవి గారిని ఎలా ఒప్పించారు?

స) చిరంజీవి గారు నటించిన చాలా చిత్రాలకు నేనూ ఆర్ట్ డైరెక్షన్ డిపార్టుమెంటులో పని చేసాను. నాకూ ఆయనకు మధ్య వున్న పరిచయంతో ఆయన్ని ఆడియో లాంచ్ కి ఇన్వైట్ చేసాను. ముందు కాస్త సంశయించినా సినిమా చూసిన తర్వాత బాగా నచ్చడంతో ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు.

ప్రశ్న) అంజలి పాటిల్ నటన గురించి కాస్త చెప్పండి?

స) ఫేస్ బుక్ లో ఆమెను చూసాక, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చిన విద్యార్ధి అని తెలుస్కున్నాను. ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసాను. ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. తెలుగు ఇండస్ట్రీలో 25ఏళ్ళ తరువాత జాతీయ అవార్డు అందుకున్న నటిగా నిలిచింది

ప్రశ్న) లో బడ్జెట్ లో సినిమా తీయడం ఎంతవరకూ కష్టం?

స) చాలా వరకూ రియలస్టిక్ గా వుండడానికి ప్రయత్నించాం. వేశ్య గృహంలో ఒక అమ్మాయి పడే బాధలను తెరపై చూపించడం మాకు బాగా కష్టమైంది. అనుకున్న బడ్జెట్ లో పూర్తిచేయడానికి మేము బాగానే కష్టపడ్డాం

ప్రశ్న) ఇప్పుడు మీ సినిమాను పెద్దపెద్ద స్టార్లు ప్రచారం చేస్తున్నారు. మీకెలా అనిపిస్తుంది?

స) వరుసగా అగ్రతారలు ప్రచారం చేయడం ఆనదంగా వుంది. సమంత, రెజినా, లావణ్య వంటి తారలు ఏ సమయంలో నైనా సినిమా ప్రచారానికి వస్తారని తెలిపారు

ప్రశ్న) ఈ సినిమా విడుదలకు ఎటువంటి ప్రణాళికలు సిద్దం చేశారు?

స) మలయాళం, తెలుగు బాషలలో కలిపి మొత్తం 100 స్క్రీన్ లలో విడుదల కానుంది. అన్ని మల్టీప్లెక్స్ లలో మా సినిమాను సబ్ టైటిల్స్ తో ప్రదర్శించనున్నారు

ప్రశ్న) చివరిగా సినిమాని ఒక్క మాటలో చెప్పాలంటే ?

స) ఇది అబ్బాయిల కోసం తీసిన లేడీ ఓరియంటడ్ సినిమా

Exit mobile version