సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నాక్కొంచం ‘కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ’ అంటూ మహేష్ బాబుతో డైలాగ్ కొట్టిన తేజశ్వి గుర్తుందా.. ఉండే ఉంటుంది లెండి. ప్రస్తుతం తేజశ్వి విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఐస్ క్రీమ్’ మరియు ’12’ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.
తన మొదటి సినిమా అవకాశం గురించి చెబుతూ ‘నేను మహేష్ బాబు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు డైరెక్టర్ శ్రీ కాంత్ మొదటగా నన్ను మీది ఏం కాస్ట్ అని అడిగారు. నేను వెంటనే కోపంగా బాగా చదువుకున్న మీరు ఇలా అడగటం బాగోలేదని అన్నాను. దాంతో ఆయన ఈ సినిమాలో నా పాత్ర ఇంట్రడక్షన్ లోనే కాస్ట్ గురించి చెప్పాల్సి ఉంటుందని వివరంగా చెప్పారు. ఆ తర్వాత సినిమా ఓకే అయ్యిందని’ అన్నాడు.
తేజశ్వి సినిమాల్లో నటించాలని అనుకోలేదు. తను జర్నలిజం చదువుతూ డాన్స్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసేది. అలాంటి తను నటిగా మారడానికి గల కారణం గురించి చెబుతూ ‘నేను ఇండిపెండెంట్ గర్ల్. నా బిల్స్, నా చదువుకి సంబందించిన అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను. నాకు మనీ అవసరం అయిన సందర్భంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చింది. ఆ తర్వాత నటిగా కంటిన్యూ అవ్వాలని అనుకోలేదు. అందుకే ఎంఏ మొదలు పెట్టాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైన ఆరు నెలలైనా ఆఫర్స్ తగ్గకపోవడంతో నా మైండ్ ని మార్చుకున్నాను. నా మొదటి సినిమాలో నటనపై ఎలాంటి ఐడియా లేదు కానీ ఆ సినిమాలో నా నటనకి మంచి పేరొచ్చింది. మనం, హార్ట్ అటాక్ సినిమా తర్వాత మారుతి ‘లవర్స్’ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలన్నీ అక్టోబర్ లోనే రానున్నాయని’ తెలిపింది.
ఐస్ క్రీమ్ సినిమా ఆతర్వాత రామ్ గోపాల్ వర్మ పిలిచి విష్ణు హీరోగా నటిస్తున్న ’12’ సినిమాలో హీరోయిన్ రోల్ ఇచ్చారు. ఈ సైకో థ్రిల్లర్ సినిమాలో విష్ణు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రేసు గుర్రం’ సినిమాలో సలోని పాత్రలో ముందు తేజశ్విని అనుకున్నారు. కానీ తన వయసు పరంగా ఆ పాత్ర సెట్ కాదని వదిలేసినట్టు తేజశ్వి చెప్పింది.
