
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై హుదూద్ బాధితుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న కార్యక్రమం ‘మేము సైతం’. నవంబర్ 30వ తేదీన సుమారు 13-15 గంటలపాటు కంటిన్యూగా జరిగే ఈ ప్రోగ్రాం కి సంబందించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా ప్రేక్షకులని ఎంటర్టైన్ చెయ్యడం కోసం ప్రతి ఒక్కరూ స్టేజ్ పై పలురకాల కార్యక్రమాలు చేయనున్నారు. అందులో ఇప్పటికే పలు కార్యక్రమాల విశేషాలను మీకు అందించాం.
తాజాగా మరో ఆసక్తికరమైన ప్రోగ్రాం విశేషాలను ప్రత్యేకంగా మీకందిస్తున్నాం… ‘మేముసైతం’ కార్యక్రమంలో 1980కి సంబందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో అప్పటి తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కలిసి అంత్యాక్షరి ఆడనున్నారు. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లతో పాటు అప్పటి హీరోయిన్స్ అయిన రాధ, రాధిక, సుహాసిని, రమ్యకృష్ణ తదితరులు కూడా పాల్గొననున్నారు. అలాగే అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన ఇళయరాజా, రాజ్ కోటి, ఎంఎం కీరవాణి తదితరులు కలిసి ఒకే స్టేజ్ పై కనిపించి ప్రేక్షకుల కోసం అంత్యాక్షరి ఆడనున్నారు.
ఈ సీనియర్ హీరోస్ కి సపోర్ట్ గా 2014లో తెలుగు తెరకు పరిచయమై గుర్తింపు పొందిన యంగ్ హీరో హీరోయిన్స్ కూడా సీనియర్ స్టార్స్ కి సపోర్ట్ గా ఈ అంత్యాక్షరి ప్రోగ్రాం లో పాల్గొననున్నారు. ఈ స్టార్ హీరోలు, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా నదరూ ఒకే స్టేజ్ పైన కనపడితే, కనపడడమే కాకుండా అంత్యాక్షరి లాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే, అభిమానులకు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అలాగే చూస్తున్న వారి ఆనందానికి అవధులు ఉండవు. మరి ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలి అంటే నవంబర్ 30వరకూ ఆగాల్సిందే.