
రాష్ట్రంలో ఎలాంటి విపత్తు జరిగినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చే వారిలో తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. ఇటీవల హుదూద్ తుఫాన్ వల్ల భారీగా నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రజలకు సహాయార్ధం అందించడం కోసం తెలుగు చలన పరిశ్రమ అంతా ఒక్కటై ‘మేముసైతం’ అంటూ ఓ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నవంబర్ 30న జరగనున్న ఈ ప్రోగ్రాంలో భాగంగా స్టార్స్ అంత కాలిసి క్రికెట్ మ్యాచ్ కూడా ఆడనున్నారని ఇది వరకే తెలియజేశాం.
ఈ క్రికెట్ మ్యాచ్ లో మొత్తం నాలుగు టీమ్స్ ఉంటాయి. ఆ టీం కెప్టెన్స్ గా వెంకటేష్, నాగార్జున, ఎన్.టి.ఆర్ మరియు రామ్ చరణ్ లను ఎంచుకున్నారు. ప్రతి టీంలోనూ మొత్తం 8 మంది ప్లేయర్స్(6 హీరోస్ + 2 హీరోయిన్స్) ఉంటారు. ఇప్పటికే టీం కెప్టెన్స్ ఫైనలైజ్ అయినా టీంలోని ప్లేయర్స్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. మాకు అందిన సమాచారం ప్రకారం కెప్టెన్స్ అంతా కలిసి వేలం పాట ద్వారా తమ టీంని ఎంచుకోనున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. నవంబర్ 27వ తేదీన స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ముందుకు వచ్చిన ప్లేయర్స్ మరియు కెప్టెన్స్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో కెప్టెన్స్ వేలం పాట ద్వారా తమ టీంకి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సెలక్షన్స్ ని మీరు లైవ్ లో చూడవచ్చు. నవంబర్ 27వ తేదీన రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకూ జరిగే ఈ సెలక్షన్స్ ని జెమినీ టీవీ వారు లైవ్ గా అందించనున్నారు. సేమ్ టు సేమ్ ఐపిఎల్ ఫార్మాట్ లోనే స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ప్లేయర్స్ ని కూడా వేలం పాట(బిడ్డింగ్) ద్వారా సెలెక్ట్ చేయనున్నారు. మరి ఎవరెవరి టీంలో ఎవరెవరు ఆడుతారు, ఏఏ హీరోయిన్ ఏయే టీంలోకి వెళుతుంది అనే విషయాల కోసం మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..
మునుపెన్నడూ జరగని రీతిలో హీరో, హీరోయిన్స్ కలిసి ఆడుతున్న ఈ క్రికెట్ మ్యాచ్ ని మీరు లైవ్ గా చూడాలి అనుకుంటే వెంటనే స్టార్స్ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ ని బుక్ మై షోలో కొనుక్కోండి..