మహేష్ మొదటి సాంగ్ పై అంచనాలు పీక్స్ లో… !

Sarileru Neekevvaru

మహేష్ నిన్న ఫ్యాన్ కి పండగ లాంటి వార్త చెప్పారు. డిసెంబర్ నెలలో ఐదు సోమవారాలు ఐదు సాంగ్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొన్న టీజర్ రిలీజ్ వరకు ప్రచారం పై అంత ఫోకస్ పెట్టని చిత్ర యూనిట్ సడన్ గా స్పీడ్ పెంచారు. ఇక డిసెంబర్ మొత్తం పాటలతో హోరెత్తించనున్నారు. కాగా డిసెంబర్ నెలలో మొదటి సోమవారం అనగా వచ్చే నెల 2వ తేదీన సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల కానుంది. మహేష్ సంక్రాంతి మూవీ నుండి వచ్చే మొదటి సాంగ్ పై అంచనాలు మాములుగా లేవు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు, నేనొక్కడినే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

ఇక ఈ సోమవారం రానున్న సాంగ్ రొమాంటిక్ డ్యూయెట్ ఐయ్యే అవకాశం కలదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రశ్మిక మందాన నటిస్తుండగా, దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న విడుదల అవుతుంది.

Exit mobile version