తెలుగులో విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ ఈ మధ్యే ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తాజాగా ఈ హిట్ ఫామ్‌ను కంటిన్యూ చేసేందుకు శర్వానంద్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో మనముందుకు రానున్న విషయం తెలిసిందే. ఎక్స్‌ప్రెస్ రాజా అన్న క్యాచీ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఇక దీపావళి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇప్పటికే పోస్టర్‌తో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ తాజా టీజర్‌తో మరింతగా కట్టిపడేసింది. శర్వానంద్ తనదైన కామెడీ టైమింగ్‌తో రన్ రాజా రన్ ఫీల్‌ను తిరిగి పట్టుకొచ్చారు. మేర్లపాక గాంధీ మంచి యూత్‌ఫుల్ సన్నివేశాలతో సినిమాను మంచి ఎంటర్టైనర్గా రూపొందించారన్న విషయాన్ని టీజర్ స్పష్టం చేస్తోంది. ఇక ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో, డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన సురభి హీరోయిన్గా నటించారు. వరుస హిట్స్‌తో జోరు మీదున్న యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
