మలేషియాలో రజనీ ‘కబాలి’ భారీ షెడ్యూల్!

kabali

‘కబాలి’.. రజనీ కాంత్ హీరోగా, తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. ‘విక్రమ సింహ’, ‘లింగా’ లాంటి వరుస పరాజయాల తర్వాత రజనీ ఓ యువ దర్శకుడితో సినిమా ఒప్పుకోవడం దగ్గర్నుంచీ, భాషా సినిమాతో రజనీకి ఒక స్టైల్‌ను తెచ్చిపెట్టిన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందే సినిమా అవ్వడం వరకూ ‘కబాలికి’ అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తూ వచ్చాయి.

ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. ఈ రెస్పాన్స్ ఇచ్చిన ఉత్సాహంతో సినిమా యూనిట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం చెన్నైలో కబాలి షూటింగ్ జరుగుతోంది. మరికొద్దిరోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత మలేషియాలో ఓ భారీ షెడ్యూల్ జరగనుంది. అక్టోబర్ ౧౮న మొదలుకానున్న ఈ షెడ్యూల్ నవంబర వరకూ కొనసాగనుంది. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారు. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Exit mobile version