అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఎఫ్ 2 ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ పండుగ సీజన్ లో వేరే చిత్రాల నుండి పెద్దగా పోటీ లేకపోవడం ఈ ఈచిత్రానికి కలిసి వచ్చింది. దాంతో ఈ చిత్రం ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అలాగే ఈ ఏడాదిలో టాలీవుడ్ లో మొదటి విజయం సాధించిన చిత్రంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక కలక్షన్ల విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో 43 కోట్లషేర్ ను రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో 35.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఈ చిత్రం యొక్క మొదటి వారం వసూళ్ల వివరాలు :
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 11.80 కోట్లు |
సీడెడ్ | 4.57కోట్లు |
నెల్లూరు | 1.11కోట్లు |
గుంటూరు | 3.14 కోట్లు |
కృష్ణా | 3.12 కోట్లు |
పశ్చిమ గోదావరి | 2.36 కోట్లు |
తూర్పు గోదావరి | 4.24కోట్లు |
ఉత్తరాంధ్ర | 4.71 కోట్లు |
ఏపీ, తెలంగాణ 7 రోజుల షేర్ | 35.05 కోట్లు |