యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎఫ్ 2 ’ ‘ఫన్ అండ్ ఫ్రస్ర్టేషన్’ అనేది ఉపశీర్షిక. ఐతే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండనుందని తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడికి కామెడీ బాగా రాస్తాడని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆయన తీసిన సినిమాలు కూడా చాలా వరకు కామెడీ వల్లే ఆడాయి. కాగా అనిల్ ఈ చిత్రాన్ని కూడా పూర్తి హాస్యభరితంగానే చిత్రీకరించనున్నారట. పాత జంధ్యాలగారి చిత్రం ఈ చిత్రానికి ఇన్సిపిరేషన్ అని సమాచారం. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ చిత్రంలో తోడల్లుళ్ళుగా నటిస్తున్నారు.
ఈ నెల 30 నుంచి హైదరాబాద్లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. జులై 20 వరకు కంటిన్యూగా షూటింగ్ జరుగనుంది. వరుణ్ తేజ్ సరసన మెహరీన్ పీర్జా నటిస్తుండగా వెంకటేష్ కి జోడిగా తమన్నా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్రాజు శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు.
