కృష్ణా లో ఎఫ్ 2, వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడులేటెస్ట్ కలెక్షన్స్ !

NTR VVR F2
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ ఎఫ్ 2 కృష్ణా జిల్లాలో గురువారం 5.72లక్షల షేర్ ను రాబట్టి 13 రోజులకుగాను అక్కడ 4.22 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ 4.5కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ సార్ట్ రామ్ చరణ్ నటించిన వినయవిధేయరామ, కృష్ణా లో నిన్న కేవలం 77,651 రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టి 14 రోజులకుగాను ఈ చిత్రం అక్కడ 3.70 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫిస్ వద్ద చేతులెత్తేసింది. నిన్న ఈ చిత్రం కృష్ణా లో కేవలం 21,695 రూపాయల వసూళ్లను కలెక్ట్ చేసి 15రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.38కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

Exit mobile version