
తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త సినిమాతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల చేయనున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య స్టూడియో గ్రీన్‌తో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం. ముందుగా మే 15నే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా తాజాగా ఈ సినిమా మే 29కి పోస్ట్‌పోన్ చేశారు.
తాజాగా ‘మాస్’ సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేయడం పట్ల ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. సూర్య తన భార్య జ్యోతికతో ’36 వయధినిలె’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇక ఈ సినిమాను కూడా మే 15న విడుదల చేస్తే సినిమాకు బాగా కలిసి వస్తుందని సినిమా యూనిట్ భావించిందట. అందుకే సూర్య తన సినిమాను పోస్ట్‌పోన్ చేశాడని తెలుస్తోంది.
ఇక సూర్య సినిమా మాస్‌కి కూడా తెలుగు, తమిళ భాషల్లో భారీ ప్రమోషన్ జరగాల్సి ఉన్నందున సినిమాను మే 29కి పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో నేడు విడుదల కానుంది.