ఇటీవల ‘మహానటి’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు యువ కథానాయిక కీర్తి సురేష్ . ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో పాటు కీర్తి కి చాలా పేరు తీసుకొచ్చింది . ఇక ఈ చిత్రం తరువాత ఆమె తెలుగులో మరిన్ని చిత్రాలతో బిజీ అవుతారనుకుంటే ఇంతవరకు తెలుగులో మరో సినిమాను ప్రకటించలేదు . దాంతో ఆమె అభిమానులు నిరాశలో వున్నారు .
కానీ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో రానున్న మల్టీ స్టారర్ చిత్రంలో ఒక కథనాయిక పాత్రకు కీర్తి ని ఎంపిక చేయనున్నట్లు కొద్దీ రోజుల గా వార్తలు వస్తున్నాయి. మరి ఈవార్తలు నిజమైతే ఆమె అభిమానులకు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. మరి ఈవిషయం ఫై అధికారిక ప్రకటన వెలుబడేవరకు వేచి చూడాలి.
ఇక ప్రస్తుతం కీర్తి తమిళ్ సినిమాలతో బిజీ గా వున్నారు. ఆమె విక్రమ్ తో సామీ స్క్వేర్ , తలపతి విజయ్ తో సర్కార్ సినిమాల్లో అలాగే విశాల్ తో సందకోడి 2 చిత్రంలో నటిస్తున్నారు
