తలపడనున్న పెద్ద చిత్రాలు – ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు

తలపడనున్న పెద్ద చిత్రాలు – ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు

Published on Jun 15, 2015 10:51 PM IST

baahubali-srimanthudu
ఎంతో కాలంగా అందరు ఎదురుచూస్తున్న కొన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అవడంతో అభిమానులు ఉపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26న విడుదల కానున్న గుణశేఖర్ ‘రుద్రమ దేవి’ తో మొదలుకొని రాజమౌళి ‘బాహుబలి’ (జూలై 10) మహేష్ బాబు శ్రీమంతుడు’ (జూలై 17) బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయనున్నాయి

భారీ బడ్జెట్ తో నిర్మింపబడిన ఈ చిత్రాలపై అభిమానులకి భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ చిత్రాలలో ఏ చిత్రం విజేత అవుతుందనో అని ఎదురుచేస్తున్నారు. గతంలో కూడా ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి కాని మొదటి సారిగా 300 కోట్లు బడ్జెట్ తో తీసిన చిత్రాలు మూడు వారల విరామం లో పోటి పడనున్నాయి. ‘రుద్రమ దేవి’ ‘బాహుబలి’ రాజుల కధలతో తెరకెక్కగా ‘శ్రీమంతుడు’ భిన్నమైన కథ తో రూపుదిద్దుకుంది. ఈ చిత్రాల దర్శకులు నటులు బాక్స్ ఆఫీస్ దగ్గర మాయ చేయగలరు. వారు భారీ విజయాలు సాధించాలని ఆశిద్దాం.

తాజా వార్తలు