ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు..ఇక ‘సైరా’ విషయంలో ఆ భయం తొలగినట్టే

Syeraa3

‘సైరా’ చిత్రం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంగతి విధితమే. ‘సైరా’ టీమ్ చాలావరకు చరిత్రను ఉన్నది ఉన్నట్టే చూపారు. మధ్యలో కొన్ని కల్పితాలు, సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా ప్రధాన అంశాల్ని మాత్రం మార్చలేదు. అలా మార్చని వాటిలో నరసింహారెడ్డి వీరమరణం, ఆయన మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఉన్నాయి.

మొదట్లో చరిత్ర ప్రకారం సినిమాలో కథానాయకుడి పాత్రను మరణంతో ముగిస్తే అభిమానులు తట్టుకోగలరా అనే అనుమానం టీమ్ సభ్యుల్లో నెలకొని ఉండేది. కానీ సినిమా చూశాక ప్రేక్షకులు నరసింహారెడ్డి వీరమరణం పొందే సన్నివేశాలే అన్నిటికన్నా గొప్పగా ఉన్నాయని, ప్రత్యేకించి ఆ ఎపిసోడ్లో చిరు నటన అసమాన్యం అనేలా ఉందని చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

ఒకరకంగా ఆ క్లైమాక్స్ మూలంగానే సినిమాకు అంత మంచి టాక్ వచ్చిందని చెప్పాలి. సో.. ఇన్నిరోజులు చిత్ర బృందంలో నెలకొని ఉన్న కంగారుకు ఈరోజుతో తెరపడిందన్నమాట.

Exit mobile version