ఇటీవలే వచ్చిన భారీ పాన్ ఇండియన్ సినిమాల టీజర్ లలో దర్శకు ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” నుంచి యంగ్ టైగర్ ఎన్టీయార్ పై డిజైన్ చేసిన కొమరం భీమ్ టీజర్ ఒకటి. దీనితో తారక్ అభిమానులు మన తెలుగులో ఏ టీజర్ కు లేని ఆల్ టైం రికార్డులు నెవర్ బిఫోర్ రికార్డులను నెలకొల్పారు. ఇక ఇదే పరంపర కొనసాగిస్తూ మరో సెన్సేషనల్ రికార్డు పై కన్నేసినట్లు ఉన్నారని చెప్పాలి.
ఈ టీజర్ కు ఇప్పుడు ఏకంగా1 మిలియన్ కామెంట్స్ చేసే విధంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే 9 లక్షల మేర కామెంట్స్ తో మన తెలుగులో ఏ టీజర్ కు అందనంత దూరంలో ఉన్న దీన్ని అతి త్వరలోనే మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ టాలీవుడ్ అండ్ ఇండియన్ టీజర్ చేసేయ్యడం ఖాయంలా చూపిస్తున్నారు. ఇక అలాగే తమిళ్ లో విజయ్ నటించిన “మాస్టర్” టీజర్ కు కూడా ఇదే స్థాయి హవా నడుస్తోంది మరి వీటిలో ఏది ఈ ఫస్ట్ ఎవర్ రికార్డ్ అందుకుంటుందో చూడాలి.
