చరణ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్న అభిమానులు !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ‘రంగస్థలం’ పట్ల మెగా అభిమానుల్లో ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడింది. 1985ల కాలంలో జరిగే ప్రేమ కథ కావడం, చరణ్ లుక్స్ డిఫరెంట్ గా ఉండటంతో సినిమా మొదలైన దగ్గర్నుంచి అందరిలోను ఆసక్తి మొదలైంది. ఎక్కువ శాతం షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. చిత్రీకరణ ప్రతిరోజు వందలాది ఫ్యాన్స్ స్పాట్ కు వచ్చి చరణ్ ను కలిసే ప్రయత్నం చేసేవారు.

చరణ్ కూడా ఆశతో వచ్చిన అభిమానుల్ని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశ్యంతో షూటింగ్ మధ్యలో వీలు చూసుకుని మరీ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ఓపిగ్గా ఫోటోలు కూడా ఇస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కొందరికి వైద్య సహాయం అందేలా కూడా చేశారు. ఇలా చరణ్ అభిమానులకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ, వారిపట్ల చూపుతున్న ఆదరణకు అందరూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

చెర్రీలోని ఈ వ్యక్తిత్వం అతను మరింత ఎత్తులకు ఎదగడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. ఇకపోతే సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 30న రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version