
సినిమా సినిమాకి తన పాత్రలో, కథ, కథనాల్లో కొత్తదనం ట్రై చేసే స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. మహేష్ బాబు చేసిన లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’. ఈ సినిమాలో కొదొఆ మహేష్ బాబు ఓ డిఫరెంట్ పాత్రతో సెన్సార్ నుంచి ఒక్క కట్ కూడా లేకుండా ‘యు/ఏ’ సర్టిఫికేట్ తీసుకున్న ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మేకర్స్ అయిన మైత్రి మూవీస్ వారు మహేష్ బాబుకి సంబందించిన ఓ డిఫరెంట్ లుక్ ని రోజుకొకటి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం మహేష్ బాబు లుంగీ కట్టుకొని తమ ఫ్రెండ్స్ తో కలిసి విలేజ్ లో నడుచుకుంటూ వచ్చే స్టిల్ ని రిలీజ్ చేసింది.
ఈ స్టిల్ అభిమానులకు బాగా నచ్చేసింది. గతంలో పోకిరిలో ఓ సాంగ్స్ లో కాసేపు లుంగీలో కనిపించిన మహేష్ బాబు చాలా రోజుల తర్వాత అలా కనిపించడం, అదీ కాక ఓ విలేజ్ కుర్రాడిలా వెనక తన ఫ్రెండ్స్ బ్యాచ్ తో కలిసి నడుచుకుంటూ రావడం అనే పాయింట్ అందరికీ తెగ నచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ఊర్లో ఇలా తిరిగే ఉంటారు, ఇప్పుడు తమ హీరో అలా కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మహేష్ బాబు – శృతి హాసన్ మొదటి సారి జోడీ కట్టిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ‘సెల్వందన్’ పేరుతో తమిళంలో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియో లాంచ్ నేడు చెన్నైలో జరగనుంది.