హద్దు దాటిన అభిమానం.. హీరోయిన్ నడుముపై చేయి వేసిన అభిమాని..!

honey rose

మలయాళ నటి హనీ రోజ్‌కు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, ఆ సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ఆమె నడుముపై చేయి వేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, అభిమానం పేరుతో పరిధులు దాటడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ పరిస్థితిని హనీ రోజ్ చాలా నిబ్బరంగా, చిరునవ్వుతోనే ఎదుర్కొన్నప్పటికీ, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కేవలం ఫోటోల కోసం హీరోయిన్లను అసభ్యంగా తాకడం సరైన పద్ధతి కాదని, వారి భద్రత విషయంలో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు.

హనీ రోజ్ ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా ఇలాంటి ఈవెంట్స్ మరియు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. కాగా, తాజాగా జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version