పెద్ది రిలీజ్ డేట్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎస్‌కెఎన్

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై నిర్మాత ఎస్‌కెఎన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర ఈవెంట్‌లో ఎస్‌కెఎన్ మాట్లాడుతూ.. ‘పెద్ది’ సినిమా జూన్ 26న విడుదల కాబోతోందని, అందుకే తమ సినిమా తేదీని మార్చుకుంటున్నామని ప్రకటించాడు. ఒక బాధ్యతాయుతమైన నిర్మాత నోటి నుంచి ఈ మాట రావడంతో, ‘పెద్ది’ వాయిదా పడటం ఖాయమని భావించిన మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అయితే, ఈ గందరగోళంపై ఎస్‌కెఎన్ తాజాగా ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఆ వేడుకలో జనం అరుపుల వల్ల తన పక్కనే ఉన్న కో-ప్రొడ్యూసర్ సాయి రాజేష్ చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నానని ఆయన తెలిపారు. “పెద్ది రిలీజ్ డేట్ గురించి బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు మనం ఏమీ చెప్పొద్దు” అని సాయి రాజేష్ అంటే, ఆ సమాచారాన్ని తాను సరిగ్గా వినలేక ఇప్పటికే డేట్ అనౌన్స్ అయిపోయిందని పొరబడ్డానని ఎస్‌కెఎన్ స్పష్టం చేశారు.

తన వల్ల జరిగిన ఈ పొరపాటుకు ఎస్‌కెఎన్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ‘పెద్ది’ వంటి భారీ చిత్రాల విడుదల తేదీలను ఆయా నిర్మాణ సంస్థలే అధికారికంగా ప్రకటించాలని, తన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా తీసుకోవద్దని కోరారు. ఏదేమైనా, ‘పెద్ది’ ఎప్పుడు విడుదలైనా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఆకాంక్షిస్తూ, ఈ మిస్ కమ్యూనికేషన్‌కు ముగింపు పలికారు.

Exit mobile version