రాజమౌళి అప్పీయరెన్స్‌‌తో థ్రిల్ అయిన ఫ్యాన్స్!

rajamouli
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్‌లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడనటువంటి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా థ్రిల్ చేయడం ఒక ఎత్తైతే.. సినిమాలో ఒకానొక సన్నివేశంలో రాజమౌళి అలా కనిపించి మెరవడం ఫ్యాన్స్‌ను విపరీతంగా థ్రిల్ చేసింది.

నిన్న అర్థరాత్రి నుంచే అన్నిచోట్లా బెనిఫిట్ షోస్ పడిపోగా, ఈ ఉదయం అన్ని చోట్లా సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. ఉదయం షోలలో రాజమౌళి ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లంతా ‘జక్కన్నా.. జక్కన్నా..’ అని మారుమోగిపోవడం విశేషం. రాజమౌళి స్పెషల్ అప్పీయరెన్స్‌కు వచ్చిన క్రేజ్ చూస్తే రాజమౌళికి ఏ స్థాయిలో అభిమానులున్నారన్నది ఇట్టే అర్థమైపోతుంది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకు అన్నిచోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Exit mobile version