రియా కోసం ఫరియా.. జెట్‌లీ స్పీడు మామూలుగా లేదుగా..!

రియా కోసం ఫరియా.. జెట్‌లీ స్పీడు మామూలుగా లేదుగా..!

Published on Apr 20, 2026 10:58 PM IST

Faria-Abdullah

దర్శకుడు రితేష్ రాణా, కమెడియన్ సత్య కాంబినేషన్‌లో వస్తున్న ‘జెట్లీ’ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తుండగా ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

ఈ సినిమాలో రియా సింఘా పాత్రకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా డబ్బింగ్ చెబుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రియా కోసం ఫరియా అంటూ వారు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం విమానం నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్. సత్య ఇందులో మార్షల్ ఆర్ట్స్ వీరుడిలా తనను తాను ఊహించుకునే వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు ఈ సినిమాలో తమ కామెడీతో నవ్వించేందుకు రెడీ అవుతున్నారు.

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘జెట్లీ’, మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తాజా వార్తలు