
ఈ ఏడాది ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి సందడిగా గడవనుంది. ఈ ఫిబ్రవరిలో నాలుగు పెద్ద చిత్రాలు విడుదల కానున్నాయి. అన్నింటికన్నా ముందుగా రామ్ “ఒంగోలు గిత్త” ఫిబ్రవరి 1న రానుంది. ప్రభాస్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రానున్న “మిర్చి” ఫిబ్రవరి 7న విడుదల కానుంది. సిద్దార్థ్,సమంత ప్రధాన పాత్రలలో రానున్న “జబర్దస్త్” ఫిబ్రవరిలోనే రానుంది. ఇవే కాకుండా లక్ష్మి మంచు “గుండెల్లో గోదారి” కూడా ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ “గౌరవం”, “మిస్టర్ పెళ్ళికొడుకు”, “డి ఫర్ దోపిడీ”, “బంగారు కోడిపెట్ట”, “స్వామి రా రా” చిత్రాలు కూడా ఫిబ్రవరిలో రానున్నాయి. ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే మణిరత్నం “కడలి”, ప్రభుదేవా “ABCD”, విక్రం “డేవిడ్” ఫిబ్రవరి విడుదలకు సిద్దమయ్యాయి. గత మూడేళ్లలో ఫిబ్రవరిలో విడుదలయిన చిత్రాలలో ఒకటి లేదా రెండు చిత్రాలు మాత్రమే భారీ విజయాలు నమోదు చేశాయి.చూస్తుంటే ఈ చిత్ర నిర్మాతలు రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇందులో కొన్ని చిత్రాలు మార్చ్ కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒకే నెలలో ఇన్ని చిత్రాలు రావడం సగటు సినిమా అభిమానికి వీనులవిందు కానుంది.
ఈ ఫిబ్రవరి టాలీవుడ్ కి బిజీ నెల కానుందా?
ఈ ఫిబ్రవరి టాలీవుడ్ కి బిజీ నెల కానుందా?
Published on Jan 23, 2013 3:49 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఇరుముడి’ ర్యాంపేజ్.. ఆల్‌టైమ్ రికార్డ్ బుకింగ్స్‌తో అల్లాడిస్తున్న రవితేజ
- రవితేజ ‘ఇరుముడి’ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక నైపుణ్యం & తుది తీర్పు
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ బర్త్ డే విషెస్.. ఎప్పటికీ చిరు ఫ్యానే అంటూ క్లారిటీ..!
- ‘రాకా’పై మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్.. నోరెళ్లబెట్టాల్సిందేనట..!
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- స్పిరిట్ : ఆ విషయంలో సందీప్ రెడ్డి నిజంగా తోపే..!
- ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్.. ఆ ఒక్కటే అడ్డు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- సమీక్ష: ‘అమీర్ లోగ్’ – కొన్ని చోట్ల మెప్పించే యూత్ ఎంటర్టైనర్
- ఇది రవితేజ పవర్..ఆల్ టైం రికార్డ్ తో దుమ్ము రేపుతున్న బుకింగ్స్!
- ఏ తేదీన పోగొట్టుకున్నాడో అదే డేట్ లో దుమ్ము లేపిన మాస్ మహరాజ్..!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్

