ఆదిత్య భాస్కర్, అమ్ము అభిరామిల ‘ఫీల్ మై లవ్’ ప్రత్యేక పోస్టర్ విడుదల.. ఐదు భాషల్లో సినిమా

Feel My Love Special Poster

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న చిత్రం ‘ఫీల్ మై లవ్’. హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన తారాగణాన్ని చూపించారు.

ఈ చిత్రంలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, మధుసూదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రలు పోషించారు. చెన్నై, పుదుచ్చేరి, మున్నార్, కొడైకెనాల్ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. చిత్రానికి రాజా రవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి సంగీతం అందించగా, ఎం.ఎస్. సతీష్ సినిమాటోగ్రఫీ, అజయ్ మనోజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version