నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే సాంగ్స్, టీజర్‌తో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ప్యారడైజ్‌కు ఎంతమంది ఫైట్ మాస్టర్స్ పనిచేశారు?
ఈ చిత్రంలో మా కాంబినేషన్‌తో పాటు నవకాంత్, రియల్ సతీష్ కూడా ఫైట్ మాస్టర్లుగా వ్యవహరించారు. మేమంతా కలిసి సినిమాలో ఎంతో కీలకమైన రెండు భారీ యాక్షన్ బ్లాక్స్‌ను అత్యంత నవనవలాడేలా డిజైన్ చేశాం.
నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నాని పాత్రను దర్శకుడు శ్రీకాంత్ అత్యంత కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడల లుక్‌తో ఆయన చేసే హెవీ యాక్షన్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా ఉంటుంది. ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉండే ఈ చిత్రం కోసం నాని పర్ఫెక్ట్ బాడీ బిల్డింగ్, డైటింగ్ పాటించి బేర్ బాడీతో కష్టమైన యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు. దర్శకుడి విజన్ కోసం తన 100 శాతం అంకితభావంతో పనిచేసి కెరీర్లోనే మైలురాయిగా నిలిచే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?
ఈ సినిమా కథే సహజంగా యాక్షన్‌ను డిమాండ్ చేయడంతో, ఎంతో రిస్క్ తీసుకుని దాదాపు 10 రోజుల పాటు కొత్త బాడీ లాంగ్వేజ్‌తో యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేశాం. ఇప్పటివరకు రాని డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో షూటింగ్లో ఒకరికి గాయమైనా సరే, ఎక్కడా రాజీ పడకుండా చాలా కేర్ తీసుకుని డిజైన్ చేశాం.
మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
మోహన్ బాబు గారు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇందులో సరికొత్తగా కనిపిస్తారు. ఆయన పాత్రకు తగినట్లుగా పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండబోతున్నాయి.
కొత్త ఫైట్ మాస్టర్స్ వస్తున్నప్పుడు కాంపిటీషన్‌గా ఫీల్ అవుతారా?
కాంపిటీషన్ ఉన్నప్పుడే క్రియేటివిటీ పెరుగుతుంది. ప్రతీ రోజూ మా తొలి సినిమా చేస్తున్నట్లే భయం, నిజాయితీ, ఏకాగ్రతతో పని చేస్తాము.
నిర్మాత సుధాకర్ గారి గురించి ?
నిర్మాత సుధాకర్ గారు ఎక్కడా రాజీపడకుండా నాని, దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ‘ప్యారడైజ్’ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. వీరి కాంబినేషన్లో ఎంతో గ్రాండ్‌గా వచ్చిన ఈ సినిమా తప్పకుండా అద్భుత విజయాన్ని సాధిస్తుంది.
