ఈ డేట్ కు “రెడ్” సినిమా కూడా రెడీ అయ్యిపోయిందా.?


మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో తీసిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాడో తెలిసిందే. ముఖ్యంగా మాస్ లో మంచి హైప్ ను అందుకున్న ఆమ్ అదే ఊపులో “రెడ్” సినిమాను ప్రకటించేసి మాస్ ఆడియెన్స్ లో తన యుఫోరియాను కంటిన్యూ చేస్తూ వచ్చాడు.

అయితే ఈ చిత్రం విడుదల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి లాక్ డౌన్ లో పలు ఓటిటి ఆఫర్స్ ను వదులుకొని థియేట్రికల్ విడుదలకే ఫిక్స్ కాబడిన ఈ చిత్రం ఫైనల్ గా సంక్రాంతి రేస్ లోనే నిలబడనున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు ఎప్పుడు విడుదల చేస్తారా అన్న అంశం సాగదీతగానే వచ్చింది..

కానీ ఫైనల్ గా మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 15న విడుదల చేయనున్నట్టు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా మాల్వికా శర్మ, నివేత పెత్తురాజ్, అమృత అయ్యర్ లు నటిస్తున్నారు. అలాగే మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version