
తమిళ స్టార్ హరో అజిత్ – ‘శౌర్యం’ ఫేం శివ కాంబినేషన్ లో వచ్చిన ‘వీరమ్’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా మొదలు కానుంది.
ఈ సినిమా పూర్తి అన్న – చెల్లెళ్ళ సెంటిమెంట్ తో తెరకెక్కనుంది. గత కొంత కాలంగా ఈ సినిమాలో అజిత్ కి చెల్లెలిగా నటించే అమ్మాయి కోసం తెగ అన్వేషిస్తున్నారు. ఇప్పటికే బిందు మాధవి, నిత్యా మీనన్ ఇలా చాలా మందిని పరిశీలించారు. కానీ ఆ వార్తలన్నిటికీ ముగింపు పలికేలా ఈ చిత్ర టీం ఒకర్ని ఫైనలైజ్ చేసారు.
ఈ చిత్ర టీం తాజాగా అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ ని అజిత్ కి చెల్లెలిగా సెలక్ట్ చేసారు. లక్ష్మీ మీనన్ విశాల్ నటించిన ‘పల్నాడు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. అజిత్ సిస్టర్ పాత్రకి తనైతేనే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఎంపిక చేసారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని చాలా రోజుల తర్వాత ఎఎం రత్నం నిర్మించనున్నాడు. మొదటి సారి శృతి హాసన్ అజిత్ సరసన జోడీ కట్టనుంది.

