‘పెద్ది’ నుంచి అవైటెడ్ అప్డేట్ రాబోతోందా?

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “పెద్ది”. టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ విడుదల అయ్యి సెన్సేషన్ ని సెట్ చేసింది. కానీ నెక్స్ట్ సాంగ్ కోసం సస్పెన్స్ అలా కొనసాగుతుంది.

కానీ ఫైనల్ గా ఈ సాంగ్ పై క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది. ఈ ఫిబ్రవరి 15 బుచ్చిబాబు సానా పుట్టినరోజు కానుకగా ఓ అప్డేట్ ని అయితే అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వారికి నిరాశ కలిగించకుండగా సెకండ్ సింగిల్ అప్డేట్ కానీ సినిమా సెట్స్ నుంచి ఓ స్పెషల్ వీడియోని కానీ మేకర్స్ వదిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఆరోజునే తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version