ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జెట్ లీ’.. ఇప్పుడైనా టాక్ మారుతుందా?

ఈ ఏడాది టాలీవుడ్ లో వేసవి సీజన్ కూడా ఒకింత డల్ గానే నడిచింది. కొన్ని చిన్న చిన్న సినిమాలు మధ్యలో వచ్చాయి కానీ అవి కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. అయితే ఇంపాక్ట్ చూపిస్తాయి అని అనుకున్న సినిమాలు కూడా కొన్ని డిజప్పాయింట్ చేసాయి. వాటిలో కమెడియన్ సత్య హీరోగా మారి చేసిన మొదటి చిత్రమే ‘జెట్ లీ’.

తనకి పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం మాత్రం డిజప్పాయింట్మెంట్ నే మిగిల్చింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మొదట ఒక్క భాషలోనే కన్ఫర్మ్ చేసిన సినిమా ఇప్పుడు తెలుగు సహా తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చిన ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ హీరోయిన్ గా సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version