‘విశ్వంభర’ నుంచి అవైటెడ్ అప్డేట్ రాబోతోందా!?

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. దీనికి ముందే స్టార్ట్ చేసిన భారీ చిత్రమే “విశ్వంభర”. భోళా శంకర్ లాంటి డిజప్పాయింటింగ్ సినిమా తర్వాత అనౌన్స్ చేసినప్పటికీ సినిమా చిరు నుంచి స్ట్రైట్ చిత్రం పైగా భారీ ఫాంటసీ సినిమా కావడంతో అప్పట్లో మంచి హైప్ నెలకొంది. కానీ సినిమా వి ఎఫ్ ఎక్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో అలా ఆలస్యం అయ్యింది.

అయితే ఫైనల్ గా ఈ భారీ సినిమా రిలీజ్ అప్డేట్ కోసం ఇపుడు టాక్ వినిపిస్తుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ ని మేకర్స్ అతి త్వరలోనే అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. ఇది వరకే సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి తెస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. సో ఆ డేట్ ని ఇప్పుడు ప్రకటించనున్నారట. మరి ఇదెప్పుడు అనేది వేచి చూడాలి. మన శంకర వరప్రసాద్ గారు ముందు వస్తుందా లేక తర్వాతే వస్తుందా అనేది చూడాల్సిందే.

Exit mobile version