మొత్తానికి ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ కొత్త డేట్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేస్తున్న సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదలకి తీసుకొస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. మొన్ననే అనౌన్స్ చేసిన ఈ సాంగ్ తర్వాత క్లారిటీ లేకుండా పోయింది.

ఇక ఈ సాంగ్ కి కొత్త డేట్ ఎట్టకేలకి అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ ని మేకర్స్ రేపు సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో థమన్ నారాయణమ్మ సాంగ్ ని ఎలా కంపోజ్ చేసాడో చూడాలి. మేకర్స్ అయితే ఆల్రెడీ చార్ట్ బస్టర్ ని డిసైడ్ అయ్యారు. సో రేపు రానున్న సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా అక్టోబర్ 9న సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version