కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై బాయ్ కాట్ సెగ!

కోలీవుడ్ లో లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన చిత్రమే ‘డొరొతి’. టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం విడుదల అయ్యాక ఒక ఊహించని స్పందన తమిళ్ ఆడియెన్స్ నుంచి అందుకుంటుంది. తమ వాళ్ళది అయితే చాలు ఎలా చూసేస్తారు అనే ధోరణికి తమిళ తంబీలు బ్రేక్ వేశారు.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇకపై ఇలాంటి సినిమాలు ఏమొచ్చినా బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిస్తున్నారు. అంతలా ఇందులో ఉన్న సబ్జెక్టు ఏంట్రా అంటే ఇందులో కార్తీక్ సుబ్బరాజ్ విభిన్న లైంగిక ధోరణులు కలిగి ఉండే మనుషుల కోసం తీయడం జరిగింది.

వారి ఫీలింగ్స్, కొన్ని పరిస్థితులని నార్మలైజ్ చేయడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అంటూ కోలీవుడ్ యువత సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అలాగే కీర్తి సురేష్ కూడా కొన్ని చూడలేని సన్నివేశాలు వంటివి ఉన్నప్పటికీ ఎలా ఒప్పుకుంది అని షాకవుతున్నారు. మరి ఈ సినిమా విషయంలో మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version