వైరల్ పిక్స్: ఎట్టకేలకి రష్మిక, విజయ్ పెళ్లి పిక్స్ బయటకి ఎమోషనల్ మూమెంట్స్

Vijay-Deverakonda-and-Rashm

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం కోసం ఈ కొన్ని రోజు సినీ వర్గాలు ఇంకా సోషల్ మీడియాలో హడావుడి జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఫిబ్రవరి 26 ఉదయం ఎట్టకేలకి ఈ జంట భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు. అయితే ఈ వార్తలు బయటకి వచ్చేసాయి కానీ నవ వధూవరులు ఫోటోలు మాత్రం బయటకి ఎక్కడా రాలేదు.

చిన్న లీక్ కూడా బయటకి రాకపోవడంతో వారి పెళ్లిలో ఆనంద క్షణాలు చూడాలని ఎదురు చూస్తున్న వారికి మరింత సస్పెన్స్ గా మారింది. కానీ ఫైనల్ గా విజయ్ దేవరకొండ తమ పెళ్లిలో మధుర క్షణాలని పంచుకున్నాడు. రష్మికతో కలిసి ఏడడుగులు నడిచిన ఆ ఎమోషనల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు మరింత ఎమోషన్ అవుతున్నారు. ఇక ఈ ఫోటోలలో ఇద్దరి నడుమ భావోద్వేగం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనితో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Exit mobile version