
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ గా నటించిన చిత్రం “చక్ర”. ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ చిత్రం మొదట గతంలో ఇదే విశాల్ చేసిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అభిమన్యుడు షేడ్స్ లో లానే అనిపించింది. కానీ ఈ చిత్రం విడుదల దగ్గరకు వస్తున్నా కొద్దీ మేకర్స్ రివీల్ చేస్తున్న ఒక్కో అంశం మాత్రం దానికి దీనికి సంబంధం లేకుండా సరికొత్త థ్రిల్ ను ఇవ్వడం కన్ఫర్మ్ అన్నట్టుగా తెలియజేసింది.
సరే ఇదంతా బాగానే ఉంది ఈ ఫిబ్రవరి 19న విడుదలకు రెడీ అయ్యింది. కానీ లాస్ట్ రెండు రోజుల్లోనే విశాల్ కు అనుకోకుండా సరికొత్త చిక్కులు ఎదురయ్యాయి. తన లాస్ట్ చిత్రం “యాక్షన్” నిర్మాతలు పెట్టిన కేసు వల్ల ఆగిపోతుంది ఏమో అని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కానీ ఎట్టకేలకు ఆ చిక్కులు అన్నిటినీ క్లియర్ చేసుకొని ఈ చిత్రం అనుకున్న సమయానికే గ్రాండ్ విడుదలకు రెడీ అయ్యింది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతం అందించాడు.