రజినీ ‘విక్రమసింహా’ కి వీడని ఫైనాన్స్ కష్టాలు

rajnikanths_Kochadaiiyaan
రజినీకాంత్ మూవీ ఫైనాన్సియల్ ఇబ్బందుల్లో ఇరుక్కుందా.? ఇది వినడానికి భాకరమైన విషయమైనా నిజం. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ‘విక్రమసింహా’ మే 23న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

కానీ చూస్తుంటే ఆ టైం కి కూడా ఈ సినిమా వ్వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ‘కొచ్చాడియాన్’ తమిళ నిర్మాత ఫైనాన్సియల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాకి ఫుల్ అమౌంట్ కట్టకపోవడమే కాకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మడం లేదు. అందరూ ఇదొక కార్టూన్ ఫిల్మ్ అనుకుంటున్నారు.

సినిమా రిలీజ్ టైంకి నిర్మాత ఫైనాన్సియర్స్ కి డబ్బు కట్టాలి కానీ డిస్ట్రిబ్యూటర్స్ డబ్బు పి చేయకపోవడంతో నిర్మాత ఫైనాన్సియల్ గా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. కానీ ఇలాంటి ఫైనాన్సియల్ ఇబ్బందులు రజినీకాంత్ సినిమాకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version