‘ప్రేమనే ఊరిలో’ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదల

గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. “వెల్కమ్ టూ ది ల్యాండ్ ఆఫ్ లవ్” (Welcome to the Land of Love) అనే క్యాప్షన్‌తో పచ్చని పొలాలు, ఎడ్లబండి, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను రూపకల్పన చేశారు.

ఈ చిత్రానికి మనోజ్ కుమార్ కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘కేజీఎఫ్’, ‘కాంతారా’ చిత్రాలకు సంభాషణలు అందించిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు మాటలు రాస్తుండగా, సునద్ గౌతమ్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పల్లె జీవనశైలి, స్వచ్ఛమైన మానవ సంబంధాలు, భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version