అల్లరి నరేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

అల్లరి నరేష్ భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విధితమే. కొన్ని నెలల క్రితమే మొదలైన ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి ‘ఫన్ రాజా ఫన్’ అనే వెరైటీ టైటిల్ ను నిర్ణయించారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదలచేయనున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ఒక కీలక పాత్ర చేయనున్నాడు. ‘రంగులరాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల ఈ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. బ్లూ ప్లానెట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని నరేష్, సునీల్ భావిస్తున్నారు. గతంలో నరేష్, భీమినేనిల ‘కలయికలో ‘సుడిగాడు’ లాంటి కామెడీ ఎంటర్టైనర్ వచ్చి ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హోప్స్ ఉన్నాయి.

Exit mobile version