సంక్రాంతికి ఆ విధంగా సెండ్ ఆఫ్ ఇచ్చేశారు

i-gopala-gopala

తెలుగు పండగలలో పెద్ద పండగగా కీర్తింపబడి టాలీవుడ్ కి జాక్ పాట్ సీజన్ గా అభివర్ణింపబడే సంక్రాంతి ఈ ఏడాది సున్నితంగా గడిచిపోయింది. పవన్, వెంకీల ‘గోపాల గోపాల’ మినహా డైరెక్ట్ గా విడుదలైన పెద్ద సినిమా మరొకటి లేదు. శంకర్, విక్రమ్ ల ‘ఐ’ భారీ స్థాయిలో విడుదలైనా మాస్ ని మెప్పించలేకపోయింది.

ఈ సంక్రాంతికి చాలా సినిమాల ఫస్ట్‌ లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదల కావడం విశేషం. వాటిలో రామ్‌ ‘పండగ చేస్కో’, నాని ‘ఎవడే సుబ్రమణ్యం’, నారా రోహిత్‌ ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’, సాయిధరమ్‌ తేజ ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ మరియు ‘రుద్రమదేవి’ సినిమాలోని అల్లు అర్జున్‌ తాజా లుక్‌… ఇలా చాలా సినిమాలకి సంబంధించిన లేటెస్ట్‌ స్టిల్స్‌, ఫస్ట్‌ లుక్స్‌ బయటకు వచ్చేసరికి సినీ అభిమానులు కాస్త ఊరట చెందారు. అన్నీ బెరేజు వేసుకుంటే ఈ పండుగ సినీ అభిమానులను వెండితెరపై ఉత్తేజపరచడంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి

Exit mobile version